![]() |
![]() |
భరణి ఎలిమినేషన్ అయి రావడానికి రెండు కారణాలున్నాయి.. ఒకటి అతనికి బాండింగ్స్ ఉన్నాయి.. రెండు ధర్మరాజు తప్పు చేయడు.. కానీ చేస్తే అది కురుక్షేత్రమే అన్నట్టుగా.. ఒక బెడ్ టాస్క్ లో అతని తప్పు ఉన్నా అది చెప్పకుండా గేమ్ లో నుండి తప్పుకోకుండా ఆడాడు.. దానివల్ల అతడికి ఆడియన్స్ లో నెగెటివ్ అయ్యాడు. అప్పటిదాకా జెన్యున్ గా ఆడిన భరణి ఆ ఒక్క టాస్క్ తర్వాత ఆడియన్స్ నమ్మడం మానేశారని తెలుస్తోంది. అందుకే ఓటింగ్ లో రాము ఉన్నా కూడా ఇతను ఎలిమినేషన్ అవ్వడమనేది నిజంగా అన్ ఫెయిర్. ఆరోవారం భరణి ఎలిమినేషన్ తర్వాత హౌస్ అంతా ఓ పెద్ద దిక్కుని కోల్పోయిన వారిలా ఎమోషనల్ అయ్యారు.
ఇక ఈ సీజన్ లో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అందుకున్న కంటెస్టెంట్ గా భరణి నిలిచాడు. అతడు రోజుకి యాభై వేలు తీసుకున్నాడని తెలుస్తోంది. అంటే ఒక్కో వారానికి మూడు లక్షల యాభై వేలు రెమ్యునరేషన్ తీసుకున్నాడన్న మాట. ఈ లెక్క ప్రకారం ఆయన హౌస్ లో ఉన్న ఆరు వారాలకు గానూ ఇరవై ఒక్క లక్ష అందుకున్నట్టు తెలుస్తోంది.
![]() |
![]() |